పెద్దింటికి” పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం
సిరిసిల్ల. జనవరి.06.( జనం సాక్షి). ప్రముఖ కథా నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘గుండెలో వాన’ కథా సంపుటికి పీచర సునితా రావు స్మారక సాహిత్య పురస్కారం వరించింది. జనవరి 8వ తేది ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతి మినీ హాల్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును పెద్దింటి అశోక్ కుమార్ అందుకోనున్నారు. ప్రముఖ కవి రచయిత దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి పాల్గొనే ఈ కార్యక్రమంలో కవిత్వంలో వెల్దండి శ్రీధర్, విమర్శలో వెలదండ నిత్యానందరావులు కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పెద్దింటి రాసిన గుండెలో వాన కథా సంపుటి ఇదివరకే ఆంధ్ర సారస్తత పరిషత్ సాహిత్య పురస్కారంతోపాటు మరో రెండు పురస్కారాలకు ఎంపికయింది. పెద్దింటి అశోక్ కుమార్ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.




