Wednesday, 4 November 2026

అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ కలెక్టర్ కు ఫిర్యాదు.

.

 

 

 

 

 

 

ఊరుకొండ, జనవరి 27 (జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలోని హై వే పైన సర్వే నెంబర్ 402, 403, 410 వ్యవసాయ భూమి 42 ఎకరములు, ఇట్టి భూమికి పట్టదారులు పాండురంగరావు, రక్షిత కౌలు దారు దళితుడు అంతయ్య, ఇతని వారసులు ఐదు మంది ఆడ బిడ్డలు, ఈ భూమి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడ ఉన్నదని, ఈ భూమి పై తెరాస నాయకుల కన్ను పడిందని.. ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హై కోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టి రక్షిత కౌలు దారులను పక్కన పెట్టి, వ్యవసాయ భూమిని ప్లాట్స్ చేసి అమ్ముటకు, కమర్సియల్ కింద అక్రమంగా వ్యవసాయ భూమిని మార్చారు. మొన్న ఈ వెంచర్ లో తప్పుడు పద్ధతులు పాటిస్తున్నారని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ మీద ఎమ్ జే ఆర్ తన అనుచరులతో దాడి చేసిన సంగతి విదితమే అనీ.. దళితుల రక్షిత కౌలుదారులుగా ఉన్న భూమిని అక్రమంగా లే ఔట్ చేసిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పై చట్ట పరమైన చర్య తీసుకోవాలని బీజేపీ అచ్చంపేట నేత, ప్రముఖ దళిత నాయకులు దేవని సతీష్ మాదిగ బాధితులకు అండగా ఉంటూ నాగర్ కర్నూల్ జిల్లా రెవెన్యూ కలెక్టర్ ను కలిసి పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అక్రమ లే అవుట్ మీద విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కల్వకుర్తి ఆర్ డి ఓ గార్కి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.