ఊరుకొండ, జనవరి 27 (జనంసాక్షి):మృతుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటు, బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయుతనిస్తున్న మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి అని గుడిగాని పల్లి సర్పంచ్ రజిత కృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన కావలి బాలయ్య(50) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ద్యాప నిఖిల్ రెడ్డి గారికి తెలియజేసారు. తక్షణమే స్పందించిన నిఖిల్ రెడ్డి డి ఎన్ ఆర్ యువసేన పేరిట రూ.5000/- తక్షణ ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజిత కృష్ణయ్య మాట్లాడుతూ.. ద్యాప నిఖిలన్న మండలంలోని ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని, బాధితులు ఆత్మస్థైర్యంతో ఉంటూ మాకు ఆపద అంటే నిఖిల్ అన్న సహాయం తప్పక వస్తుందని ధైర్యంగా ఉంటున్నారని తెలిపారు. మండల ప్రజలను ఎల్లవేళలా ఆదుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా, అన్నా…అంటే నేనున్నా అంటూ, తన సహాయ సహకారాలు అందిస్తున్న ద్యాప నిఖిల్ రెడ్డి గరిబోళ్ల గుండెల్లో గూడు కట్టుకున్నారని, నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకు అయ్యారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీపతి, రుక్మారెడ్డి, ఇద్దయ్య, కృష్ణా రెడ్డి, రామచంద్రయ్య, బాలస్వామి, బాలయ్య, స్వామి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.




