Tuesday, 3 November 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్ రెండు బైకులు నగదు స్వాధీనం.

 

 

 

 

 

 

 

 

నేరడిగొండ జనవరి27(జనంసాక్షి): మండల కేంద్రంలోని అంకుల్ లొద్ది వడూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజున పెకాట ఆడుతున్న స్థావరంపై విశ్వసనీయత సమాచారం ప్రకారం ఎస్ ఐ సాయన్న తోపాటు పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకున్నారు.రెండు బైకులు రెండు వేల రూపాయల నగదు తోపాటు 52 పెక్కట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు పాలుపడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.