Wednesday, 4 November 2026

అక్షయ రైతు ఉత్పత్తిదారుల ఆధ్వర్యం లో మిర్చి కొనుగోలు సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం

అక్షయ రైతు ఉత్పత్తిదారుల ఆధ్వర్యం లో మిర్చి కొనుగోలు సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం

జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సరిత

జనం సాక్షి,చెన్నా రావు పేట

అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమావేశం చిర్ర సృజన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సరిత మాట్లాడుతూ మిర్చి కొనుగోలు కోసం ప్రణాళికలు చేస్తున్నమని చెన్నారావుపేట, నెక్కొండ మండలంలో క్లస్టర్ల స్థాయిలో మిర్చి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాష్ట్రస్థాయిలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చే ఈ కొనుగోలు సంబంధించి ఎం ఓ యు జరిగిందని ఈ కొనుగోలు ద్వారా ఈ ప్రాంత రైతులకు మార్కెట్లో లభించే ధరతో పాటు రైతులకు అదనంగా అయ్యే ఖర్చులన్నీ కూడా తగ్గుతాయని 48 గంటల్లో వారు అమ్మిన సరుకుకూ అమౌంటును వారి ఖాతాకు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సౌకర్యము ఈ ఆర్థిక సంవత్సరంలో తేజ పండించే రైతులకు మాత్రమే ఉంటుందని తెలపడం జరిగింది. అక్షయ ఆధ్వర్యంలో నెక్కొండ చెన్నారావుపేటలో ఫర్టిలైజర్ నిర్వహణ కోసం సంబంధిత అధికారులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాలలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తప్పనిసరిగా నిర్వహించుకోవాలని, రైతులకు ఏ విధంగా లాభాలను అందించవచ్చో ప్రణాళికలు తయారు చేసుకొని అక్షయ ఎఫ్పిఓలో నివేదించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో రెండు మండలాల ఏపీఎంలు ముక్కెర ఈశ్వర్,శ్రీనివాసు, సీసీలు రవి, యాకాంబరం, వెంకటేశ్వర్లు, మాణిక్యం, కట్టయ్య, మంజుల, బోర్డు డైరెక్టర్లు తిరుమల, అనిత, సునీత, చిన్ని తదితరులు పాల్గొన్నారు.