ధారుర్ కాలినడక యాత్రికులకు అన్నదానం
జహీరాబాద్ నవంబర్ 16( జనం సాక్షి )వికారాబాద్ జిల్లాలో జరిగే క్రైస్తవుల అతిపెద్ద ధారుర్ జాతర కు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం కాలినడకన ప్రయాణిస్తుంటారు.బుధవారం జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామం వద్ద ప్రయాణికులకు జహీరాబాద్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల చేతుల మీదుగా భోజనాలు, వాటర్ బాటిళ్లు అందివ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మెతడిస్ట్ క్రైస్తవ యువకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు అలెగ్జాండర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డప్పు ప్రేమ్ కుమార్ బి.ఎస్.పి జహీరాబాద్ ఇంచార్జ్ షేక్ ఎక్బాల్ పాల్గొన్నారు
ధారుర్ కాలినడక యాత్రికులకు అన్నదానం




