జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా
ఉపాధ్యక్షులు యేకుల సురేష్.
కొండమల్లేపల్లి నవంబర్ 16 జనం సాక్షి న్యూస్ :
నెెేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ
సమాజంలో జరుగుతున్నటువంటి
ప్రతి సంఘటనను, విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్రంట్ వారియర్స్ గా ఉంటూ వారి జీవితాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. పత్రికలు సమాజంలో జరుగుచున్నటువంటి ఘోరాలు నేరాలు ప్రజలకు తెలియ పరుస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నాయన్నారు . మరియు రాజకీయం పరంగా కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రజాలకు కావలసినటువంటి హక్కులు పొందే విధంగా ప్రజల హక్కులను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండాలన్నారు. ప్రజలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండాలన్నారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా కొనసాగుతున్నటువంటి మీడియా అ గౌరవాన్ని పొందే విధంగా ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని కోరారు.
జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ




