Wednesday, 4 November 2026

అక్షయ రైతు సమైక్య-రైతులకు అక్షయపాత్రలా కావాలి రైతుల అవసరాలను గుర్తించి ప్రణాళికలు చేపట్టాలి. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొట్టే శ్రీనివాస్

 

జనం సాక్షి, చెన్నరావు పేటగ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అక్షయ మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య సమావేశాన్ని చిర్ర సృజన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొట్టే శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య రైతుల ఆలోచనలకు రూపాన్ని ఇచ్చే విధంగా, వారి ఉత్పత్తులు అమ్ముకునే విధంగా, లాభాలు అర్జించే విధంగా, ఆచరణ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా , సమావేశాల నిర్వహణ ఉండాల్సిందిగా, రైతుల కోసం సిబ్బంది పునరంకితం కావాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.రైతుల ఆలోచనలు, అవసరాలు, అక్షయ సమావేశంలో ఎజెండా కావాలని, ఆచరణ ద్వారా ఆర్థిక ఫలాలు ప్రతి రైతు పొందాలని, ఆదర్శవంతంగా అక్షయ పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సరిత మాట్లాడుతూ నేషనల్ స్థాయిలో చెన్నారావుపేట మండలం పైలెట్ ప్రాజెక్టుగా సమీకృత వ్యవసాయ క్లస్టర్ను అభివృద్ధి పరచడానికి అవకాశం వచ్చిందని, దీని ద్వారా ఇక్కడి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి, వ్యవసాయ,& వ్యవసాయ కుటుంబాల అభివృద్ధికి ప్రయోగపూర్వక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుందని, అక్షయ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వలన ఈ అవకాశం చెన్నారావుపేట మండలానికి దక్కిందని, అందరూ సమిష్టిగా కృషిచేసి ఈ ప్రాజెక్టును కూడా విజయవంతం చేయాల్సిందిగా తెలియజేశారు.సేర్ఫు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ముక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ఎఫ్పిజిల ద్వారా రైతుల సరుకుల విక్రయాలకు వేదికగా అక్షయ పని చేయాల్సిందిగా, మొక్కజొన్న, మిర్చి, వివిధ రకాల రైతు ఉత్పత్తులను నేరుగా పెద్ద కంపెనీలతో అనుసంధానం చేస్తున్నామని, వ్యవసాయ ఆహార అనుబంధ కార్యక్రమాల ద్వారా రైతులకు మరింత ఆదాయంతో పాటు, శ్రమ తప్పుతుందని,గ్రేడింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఆదాయాలు పెరుగుతాయని తెలియజేయడమైనది.మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ అక్షయ ద్వారా మిర్చి కొనుగోలు నాలుగు మండలాలలో 13 గ్రామాలలో 72 రైతుల వద్ద 583 క్వింటాల్ల మిర్చి, కొనుగోలు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం శ్రమతో కూడినప్పటికీ, దీని ద్వారా రైతుకు నేరుగా ప్రతి క్వింటాకు 3000 నుండి 4000 రూపాయల వరకు అదనంగా లాభం పొందారని, ఖర్చులు లేకుండా, అమ్మిన నాలుగు రోజుల్లో వారి ఖాతాలకు నేరుగా డబ్బును జమ చేయడం జరిగిందని ఏపిఎం ఈశ్వర్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నెక్కొండ ఏపిఎం శ్రీనివాస్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఏకాంబరం, రవి, శారద, వెంకటేశ్వర్లు కట్టయ్య మాణిక్యం, సుజాత, మంజుల, అక్షయ మేనేజర్ ఐలయ్య, రజిత, ఉమా, అక్షయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తిరుమల, అనిత, చిన్ని, రామక్క తదితరులు పాల్గొన్నారు.