మిర్యాలగూడ జనం సాక్షి.2023 అక్టోబర్ వరకు 18 సంవత్సరాలు వయసు నిండిన వారిని గుర్తించి ఓటర్ సర్వే ను చేపట్టినట్లు మిర్యాలగూడ ఆర్డీవో బి. చెన్నయ్య తెలిపారు. శనివారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ ఇందులో భాగంగా బదిలీ అయిన ఓటర్లు, చెందిన ఓటర్లను కూడా జాబితా నుండి తొలగించడం తోబాటు ఒకే ఇంట్లో ఆరు ఓట్లను మించి ఉన్న గృహాలను ప్రత్యేకంగా నమోదు చేసి వాటి వివరాలను తుది జాబితాలో పొందుపరుస్తామన్నారు. ఈ సర్వే ఆగస్టు రెండో తేదీ వరకు డివిజన్ వ్యాప్తంగా గడపగడపకు నిర్వహిస్తామన్నారు. అనంతరం జాబితాను ముద్రించి ఆగస్టు 31 వరకు సూచనలు అభ్యంతరాలు గడువు లోపల స్వీకరించి తుది జాబితాను అక్టోబర్ 4వ తేదీన ప్రకటిస్తామన్నారు




