అఖిలభారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నా రోజు భాగ్యరేఖ
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) అఖిలభారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నా రోజు భాగ్యరేఖ ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భంగా నారోజు భాగ్యరేఖ మాట్లాడుతూ రాష్ట్ర మహిళా కార్యదర్శి గా నియామకానికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రం లో విశ్వకర్మ మహిళా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విని శర్మ ‘ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , జాతీయ యూత్ అధ్యక్షులు దిలీప్ కుమార్ చారి రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు .