హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): నగరంలోని పాతబస్తీలోని ఓ చెప్పుల గోదాములో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక ఠాణా పరిధిలోని ఫలక్‌నుమా పోస్టాఫీస్ సవిూపంలోని ఈ గోదాము నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని మాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా గోదాము పక్కనే ఉన్న భవనంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు. ఆస్తినష్టం
భారీగానే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గోదాం పూర్తిగా దగ్ధం అయ్యింది.




