జుక్కల్, ఎప్రిల్ 13, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల కేంద్రంలోి గల అగ్నిమాపక కార్యాలయం ఆవరణలో గురువారం అగ్నిమాపక మద్నూర్ శాఖ అధికారి వినోద్ కుమార్ అధ్వర్యంలో స్ధానిక తహాసీల్దార్ అనిల్ కుమార్ చేతుల మీదుగా అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా అగ్ని మాపక అధికారి మాట్లాడుతు ఎప్రిల్ 14జాతీయ అగ్నిమాపక దినోత్సవం పురస్కరించుకుని ఈ పోస్టర్ విడుదల చేశామని తెలిపారు.వారం రోజుల పాటు వివిధ గ్రామాలలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదం జరిగితే ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్గిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం స్ధానిక సర్పంచ్ దరావత్ సురేష్,బిఆర్ఎస్ పార్టి మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్,అగ్నిమాపక సిబ్బంది నర్సింలు, రాణా ప్రతాప్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.




