Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే శ్రీరామరక్ష..కార్యకర్తలను కంటి రెప్పలాకపడుకుంటాం-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

 

 

 

 

 

 

నెరడిగొండఏప్రిల్12(జనంసాక్షి):మరోసారి తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ధీమా వ్యక్తం చేశారు.బుధవారం రోజున మండల కేంద్రంలోని సూర్య గార్డెన్ లో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎమ్మెల్సీ శ్రీనివాస్ గౌడ్ జడ్పీటీసీ అనిల్ జాధవ్ లకు సన్మానించారు.వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష.. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపడుకుంటామని అన్నారు.
మరోసారి అధికారం మనదేనని,కార్యకర్తలు కార్యదీక్షులయి ఇంటింటికి తిరిగి ప్రజలకిఅభివృద్ధి-సంక్షేమ పథకాలని వివరించాలని మండల నాయకులకు సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి మరింత చైతన్య పరిచేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని వారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తు నాయకులు కార్యకర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి – సంక్షేమ పథకాలు మన రాష్ట్రం లో అమలవుతున్నాయని అన్నారు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా చేస్తు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు వృద్దులకు వికలాంగులకి ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాది ముభారాక్ పథకాల ద్వారా గౌరవంగా అడా బిడ్డల పెండ్లికి సహాయం అందిస్తున్నామని అన్నారు.
గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యని అందిస్తుంది మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ కి మద్దతు ఇవ్వాలని కోరుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి కి గుణపాఠం చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఎంపీపీ రాథోడ్ సజన్ జడ్పీటీసీ అనిల్ జాధవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మన్ సింగ్ నాయకులు పార్టీ ఆయా మండల కన్వీనర్లు శివారెడ్డి ఏనుగు కృష్ణరెడ్డి మాజీ ఏఎంసి చైర్మన్ దావుల బోజన్న మాజీ జడ్పీటీసీ కవి గడ్డం భీంరెడ్డి జహీర్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ సర్పంచ్లు పెంట వెంకట రమణ విడిసి చైర్మన్ రవీందర్ రెడ్డి ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.