Wednesday, 4 November 2026

ఖమ్మం సి. పి. ని కలిసిన బి.ఎస్.పి. నాయకులు

 

 

 

 

 

 

 

ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి )దేవాదాయ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రెంటాల సమత ని దూషించి బెదిరించిన కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని ఈ ఘటన కి కారకుడైన పాలేరు ఎం.ఎల్. ఏకందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు,బి.ఆర్.ఎస్. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ని అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఖమ్మం సి. పి.ని కలిసి మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా బి.ఎస్.పి. రాష్ట్ర కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు మాట్లాడుతూ బెల్లం వేణుగోపాల్, పాలేరు ఎం. ఎల్. ఏ. అనుచరుడుగా మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతో, అధికార పార్టీ అనే పొగరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, మహిళ అనే విచక్షణ లేకుండా, తాను చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తూ, దుర్భాషాలాడుతూ పాలేరు అసెంబ్లీ పరిధిలో తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. దొర దూరహంకార పోకడలతో బహుజన ఉద్యోగులను దూషిస్తే బి. ఎస్. పి. చూస్తూ ఊరుకోదని వేణుగోపాల్ అధికార పార్టీ అయినా,మంత్రి అజయ్, ఉపేందర్ రెడ్డి అండదండలు ఉన్నా కూడా చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.సి. పి. కూడా ఈ ఫిర్యాదు విషయమై సానుకూలంగా స్పందించారని తప్పక చర్యలు తీసుకుంటామన్నారని అన్నారు. బి. ఆర్. ఎస్. నాయకులు అహంకారం అధికార మదం తగ్గించుకోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. సమత కి తక్షణమే న్యాయం చేయాలని, వేణుగోపాల్ పై ఎస్.సి.,ఎస్.టి. ఎట్రాసిటీ తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి & పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్
బి. ఉపేందర్, జిల్లా కార్యదర్శి మిరియాల నాగరాజు,జిల్లా సీనియర్ నాయకులు పల్లెపోగు విజయ్, జిల్లా మహిళా కన్వీనర్ ఉప్పల మంజుల, బిట్ సెల్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ స్వేరో బచ్చలకూరి, పాలేరు అసెంబ్లీ సీనియర్ నాయకులు బచ్చలకూరి బాలారాజు తదితరులు పాల్గొన్నారు.