Wednesday, 4 November 2026

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

 

 

 

 

వేములవాడ, ఏప్రిల్ 19(జనం సాక్షి) : అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక సిబ్బంది ప్రాక్టికల్ గా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చిలుక గట్టు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.