Thursday, 5 November 2026

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలిజిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

–

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 13 (జనం సాక్షి);       అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు ,అగ్ని మాపక నివారణ పద్దతులు  ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో   తెలంగాణా రాష్ట్ర విపత్తు స్పందన,అగ్ని మాపక సేవల అగ్నిమాపక వారోత్సవాలు నేటి  నుండి ఈ నెల 20 వరకు సంబంధించిన అగ్ని ప్రమాదాలను అరికడదాం, జాతి సంపదను పెంపొందిదాం పోస్టర్ ను  జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధించబడిన ప్రదేశాలలో పొగ తాగడం. విద్యుత్ ఉపకరణాలలో స్పార్కులు, షార్ట్ సర్క్యూట్, ఓవర్ లోడింగ్,లూజు వైరింగ్ వల్ల మండే స్వభావం గల పదార్థాలు లీక్ కావటం, పొర్లటం వల్ల,వెల్డింగ్,కటింగ్ ,సోల్డరింగ్  ఇతర వేడిమిని పుట్టించే పనులు, పరిశ్రమలోని యంత్రాలను సరిగా మేంటైన్ చేయక పోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల అగ్ని ప్రమాదాలు  జరిగే అవకాశం ఉందని తెలిపారు.విద్యుత్ ఉపకరణాల పనితీరును తరుచుగా పర్యవేక్షించాలని,రసాయనిక ప్రమాదాలు జరిగినపుడు సూచనలు పాటించాలని తెలిపారు. వెల్డింగ్ కటింగ్, సోల్డరింగ్ పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని, అగ్ని సహాయకుని పర్యవేక్షణలో జరపాలని, అగ్ని మాపక సాధనాలను ఎల్లవేళలా పనిచేసే విధంగా ఉంచాలని తెలిపారు.జిల్లా లో అన్ని  ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్  స్కూల్స్, కాలేజీలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన్ కల్పించాలని తెలిపారు. ఫైర్ డ్రిల్లులను 3నెలల కొకసారి క్రమం తప్పకుండా నిర్వహించి , రెండు సంవత్సరాలకొకసారి థర్డ్ పార్టీ ఫైర్ ఆడిట్ చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక అధికారి శ్రీ దాసు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.