Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాల వల్ల ప్రజలను మోసం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారుకాంగ్రెస్ పార్టీ అలంపూర్  యువజన అధ్యక్షులు జోగుల రవి

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 13 : బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకుల వర్గ విభేదాల వల్ల ప్రజలను మోసం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని అలంపూర్ తాలూకా యువజన అధ్యక్షులు, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి మండిపడ్డారు. గురువారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బుధవారం మండల పరిధిలోని కొండేరు గ్రామ సమీపంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలా లేదని కేవలం పదవులు, కమిషన్లు, రాజకీయ అధికారం కోసం ప్రజలను అడ్డుపెట్టుకొని కార్యకర్తలను మోసం చేస్తే వేదికలపై ఒకరికి ఒకరు విమర్శించుకుంటూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ  అభివృద్ధిని మర్చిపోయి మీ స్వార్థ  రాజకీయాల కోసం ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య తగాదాలు పెట్టి పైశాచిక ఆనందం పొందడం ఎంతవరకు సమంజసమన్నారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో తోపాటు పక్కన ఉన్న గద్వాల నియోజకవర్గానికి వేల సంఖ్యలో డబుల్ బెడ్రూంలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గానికి మాత్రం 80 డబల్ బెడ్ రూములను మంజూరు అయినప్పటికీ క్యాతూర్ గ్రామంలో  20 డబల్ బెడ్ రూముల నిర్మాణాలను పూర్తి చేశారు కానీ పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇంతవరకు పంపిణీ చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటో ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్టానికి మొట్ట మొదటి సారిగా  దళితుడే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పిన కేసీఆర్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నియోజకవర్గ  ప్రజలకు కావాల్సింది ఆత్మీయ సమ్మేళనాలు కాదని ఉపాధి, ఉద్యోగం వైద్యం కోసం 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల నిర్మాణాల వంటి అభివృద్ధి పనుల కావాలన్నారు. ప్రజలను మభ్య పెట్టడం మాని వాస్తవాలను వివరించాలని ఆయన అన్నారు. లేదంటే నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ, నాయకులకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.