Thursday, 5 November 2026

వైద్య రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 13 జనం సాక్షిప్రభుత్వ వైద్య రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు* విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిమరియు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డివికారాబాద్ జిల్లా కేంద్రం అనంతగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.ముందుగా ఎమ్మెల్యే పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు*కి గజమాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ.సన్మానం చేశారు.
అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి* వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన పురోహితుని ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతగిరిలో ఆయుష్ ఆసుపత్రి* మరియు కేంద్రీయ ఔషద నిల్వ కేంద్రం* కు శంకుస్థాపనలు చేశారు.అనంతగిరిలో జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ కుమార్ విద్యా మౌలిక వసతుల మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఎంపీపీ జడ్పిటిసి సభ్యులు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.