హైదరాబాద్ : సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని అధికారులతో కలిసి మంత్రి శనివారం సందర్శించారు. కాలిపోయిన భవన శిథిలాలను క్రేన్ సహాయంతో పరిశీలించారు.
అనంతరం ఆయన బస్తీవాసులతో మాట్లాడారు. రెండురోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఇంకా మంటలు చల్లారకపోవడంతో ఫైర్ అధికారులు ఫోమ్ తో స్ప్రే చేస్తున్నారని వెల్లడించారు. క్లూస్ టీమ్ తో పాటు జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులు భవనాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు.
పక్క భవనాలకు నష్టం జరగకుండా కొత్త టెక్నాలజీతో భవనాన్ని కూల్చడానికి రెండురోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. భవనంలో డెడ్ బాడీలు కనిపించడం లేదని, ఎవరూ కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నెల 25న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం : మంత్రి తలసాని




