..
-సర్పంచుల ఫోరం
జనంసాక్షి,సైదాపూర్,జనవరి 21
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కంటి వెలుగులో కంటి పరీక్ష చేసుకొని 24 గంటల కరెంటు ఉందో లేదో తెలుసుకోవాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష ,కార్యదర్శు చంద శ్రీనివాస్ ,కాయిత రాములు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య లు డిమాండ్ చేశారు .శనివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కదాలేని విధంగా రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తు నిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ కోతలతో రైతన్నలు రాత్రింబవళ్లు పొలాల కాడికి వెళ్లి పాముకాట్లకు ,విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటనలు కోకోల్లో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనతి కాలంలోనే రాష్ట్రానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్తు అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బండి సంజయ్ కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తూ ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్‌ను రాజకీయం చేయడాన్ని వారు తప్పుబట్టారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్నాయని అందుకే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కేంద్రంలో కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లక్షలాదిమంది ప్రజలు తరలిరావడమే నిదర్శనం అన్నారు. గత 14 సంవత్సరాల ముందు ఆదాని, అంబానీలు ధనవంతుల జాబితాలో వెనుకబడి ఉంటే నేడు లక్షల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉన్నారని దుయ్యబట్టారు. ఇందుకు దేశాన్ని పరిపాలిస్తున్న ఇద్దరు గుజరాతీలే కారణమని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచే పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంలో ఉన్నారని ఆ పథకాలే తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని వారు పేర్కొన్నారు.




