ఫొటో : ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 13, (జనంసాక్షి )కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపార వేత్త అధానికి ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబెడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ, అధానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధాని మీద మని లాండరింగ్ కేసు నమోదు చేసి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు అయన తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి డిఆర్ శ్రీధర్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, బీసీ సెల్ జిల్లా నాయకుడు ఆడెపు రాజమౌళి, బికేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, ఎఐటియుసి బెల్లంపల్లి అధ్యక్షుడు ఎల్తూరి శంకర్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు పోతుల లింగయ్య, సిపిఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, డిహెచ్పీఎస్ జిల్లా నాయకులు రత్నం రాజాం, బండారి శంకర్, సింగారావు భరత్, పులిపాక స్వామి దాసు, శనిగారపు రాజెందర్, ఎలకుర్తి వెంకటేష్, కొంకుల రాజేష్, దాగం రాజలింగు, దుర్గం సుధాకర్ పాల్గొన్నారు.




