అచ్చంపేట ఆర్సీ,10 ఏప్రిల్ 2023, జనం సాక్షి న్యూస్ : ఈనెల 14వ తేదీన జరగబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాల కరపత్రాన్ని అచ్చంపేటలో నిర్వహిస్తున్న సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ ప్రెసిడెంట్ పాతుకుల శ్రీశైలం ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేస్తూ ఇదే క్రమంలో అమ్రాబాద్ పదర మండలాలలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల నాయకులతో ప్రజలతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బడుగు బలహీన దళిత బహుజన మేధావులు, ప్రజలు తరలివచ్చి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమంలో బ్యాంకు బాలస్వామి ఎం శ్రీనివాసులు మల్లయ్య శ్రీశైలం బాలస్వామి కే నిరంజన్ కోశాధికారి కొంకి విజయ్ ,ప్రధాన కార్యదర్శి మీసాల ప్రభాకర్ తదితరులుపాల్గొన్నారు.




