రేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్:జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈవో రాధా కిషన్ అన్నారు. సోమవారం. వివిధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సందర్భంగా మండల కేంద్రమైన రేగోడ్ లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి నా అనంతరం విలేకరులతో మాట్లాడారు. టేక్మాల్, అల్లాదుర్గం,పెద్దాపూర్,తో పాటు రేగోడ్ కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతతో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయన్నారు. ఎ లాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థిని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు,




