Wednesday, 4 November 2026

అజ్జమర్రి చెక్ డ్యాంను పరిశీలించిన ఎంపీడీవో శశి ప్రభ.

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన మన ఊరు మన చెరువు పండగ కార్యక్రమం ఉన్నందున చిలప్ చేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలోని గల మంజీర నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ పరిసర ప్రాంతాలను ఎంపీడీవో శశి ప్రభ పరిశీలన చేసినారు అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్నటువంటి (మొహబు) పనులను పరిశీలనచేసిన ఎంపీడీవో శశి ప్రభ మాట్లాడుతూ ఈనెల 8న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన చెరువు కార్యక్రమం ఉన్నందున అజ్జమర్రి చెక్ డ్యామ్ ను పరిశీలించడం జరిగింది అలాగే పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి దాదాపుగా పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని పనులు పూర్తి కావడం జరిగింది ఇంకా కొద్దిగా చిన్నపాటిగా కొంతమేరకు పాలు ఉన్నాయి వీటిని కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్శరామ్ రెడ్డి ఎంపీడీవో శశి ప్రభ పిఆర్ఏఈ మధుబాబు ఎంపిఓ కృష్ణమోహన్ ఏపీవో శ్యాం కుమార్ ఎంపిటిసి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు