Wednesday, 4 November 2026

వడ్ల కొనుగోలు కేంద్రలు,మిల్లర్ల దోపిడీ భరించలేక,ఎన్ హెచ్ రోడ్ పై ధర్నాకు దిగిన రైతన్నలు

ఏటూరునాగారం జనం సాక్షి,జూన్03.
ఈరోజు ఐటీడీఏ ముందు ఎన్ హెచ్ రోడ్ జాతీయ రహదారి 163 పై రైతు నాయకుల మరియు చిటమట రఘు అధ్వర్యంలో లారీల కొరతను నిర్వహించి, కాంటాలు వెయ్యాలని ధర్నా నిర్వహించడం జరిగింది.వరి ధాన్యాన్ని కాంటాలు వేసి వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరతను నివారించి వరి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయాలని,వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని మిల్లులకు తొందరగా పంపించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఒక వేళ వర్షాల కారణంగా ధాన్యము తడిస్తే అట్టి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.యాసంగిలో రైతులు వరి ధాన్యాన్ని పంట పండించి కొమరోలు కేంద్రాలకు తరలించి నెలరోజులు కావస్తున్నా ఇప్పుడు వరకు కాంటాకు వేయలేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.ఏటూరు నాగారం మండలం లో వరి ధాన్యాన్ని బస్తాలు నింపి 20 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కాంటాలు వెయ్యలేదని అడుగుతే లారీల కొరకు ఉందని కాంటాలు వేస్తే తూకం తక్కువ వస్తుందని లారీలువచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామని అన్నారు.అదేవిధంగా గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్ల ఆరాబోసి మ్యాచర్ వచ్చినప్పుటికి కూడా కాంటాలు వేస్తాలేరని వెంటనే ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ స్పందించి రైతుల ఇబ్బందులను తొలగించాలని లారీల కొరతను కూడా నివారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వడకాపురం సారయ్య, PACS డైరెక్టర్ వంగపడ్ల రవి,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,చామర్తి మనోజ్ , గౌరక్క, ఉచిత రాజక్క, జాడి సమ్మయ్య,గోగు బాబు, వావిలాల రవిందర్,ప్రసాద్, రాజబాబు, తులసిరం,100 మంది మండలంలోని రైతులు పాల్గోన్నారు.