అటవి భూములు దున్నుకున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలి
చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు
జనంసాక్షి,పదర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు భూముల సర్వేలు నాగర్కర్నూల్ జిల్లాల్లో 12,500 మంది 33 వేల ఎకరాలకు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకుంటే 300 మందికి 666 ఎకరాలు ఇవ్వడం దుర్మార్గమని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్గం పర్వతాలు అన్నారు.
రేపు శుక్రవారం రోజు ఫారెస్ట్ భూములకు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వామపక్ష పార్టీ సిపిఎం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని రెండు మండలాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరులను కలసి ప్రభుత్వము చేస్తున్న కుట్రలను వివరించారు.
పదరా మండలంలోని జోత్య నాయక్ తండా, చెన్నంపల్లి చిట్లంకుంట పెట్రన్ చేనే, అమ్రాబాద్ మండలంలోని బికే తిరుమలాపురం బి కే ఉప్పునుంతల లక్ష్మాపురం లక్ష్మాపూర్ తండా గ్రామాలను కలిసి గిరిజనులతో మాట్లాడడం జరిగింది రేపు జరిగే కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు అందరూ కూడా పాల్గొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్, మల్లేష్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




