Wednesday, 4 November 2026

‘మంత్రి ఎర్రబెల్లి’ ని కలిసిన కామారెడ్డి గూడెం గౌడ్ సంఘం నాయకులు

‘మంత్రి ఎర్రబెల్లి’ ని కలిసిన కామారెడ్డి గూడెం గౌడ్ సంఘం నాయకులు..

దేవరుప్పుల, డిసెంబర్ 29(జనం సాక్షి): దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు ‘తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు’ ని కలిసి గౌడ సంఘం కమిటీ హల్ చుట్టుపరారి గోడ మరియు కాటమయ్య గుడి చుట్టూ పరారిగోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వగా..అందుకు ‘మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు’ సానుకూలంగా స్పందించి తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మొల్గుగూరి రమేష్, దుద్దుల సత్తయ్య, బజ్జూరి బిక్షపతి,మొల్గూగూరి యాకయ్య, ఓడపల్లి యాకయ్య, పులిపంపుల ఉప్పలయ్య, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.