Monday, 2 November 2026

అట్టుడుకుతున్న ఆంధ్రా

C

– హింసాత్మకంగా మారిన కాపు రిజర్వేషన్‌ ఉద్యమం

– పోలీస్‌ స్టేషన్లు, రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

– ఉద్రిక్తంగా తుని

విజయవాడ/తుని,జనవరి31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ లో కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం హింసాత్మకంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇవాళ నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. తునిలో రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు నిప్పు పెట్టారు. ఒక బోగీ నుంచి ఇంకో బోగీలోకి మంటలు వ్యాపించి, రైలు మొత్తం తగులబడింది. రైలులోని ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. రైల్వే పోలీసులను ఆందోళనకారులు కిందికి లాక్కొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆందోళనకారులు రైలులోకి ఎక్కిన విషయం గుర్తించిన డ్రైవర్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించారు. దీంతో, భారీ ప్రాణనష్టం తప్పింది. కాపు ఉద్యమ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా ఆందోళనకారులంతా రైలు ఇంజిన్‌ పైకి ఎక్కారు. మరోవైపు, ఆందోళనకారులు తుని అర్బన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేశారు. పోలీస్‌ స్టేషన్లకు, అక్కడున్న పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఓ కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో స్టేషన్లలో తక్కువ మంది పోలీసులు ఉన్నారు. పోలీసులు కాపు గర్జన బందోబస్తులో ఉండటంతో ఆందోళనకారులు అవకాశంగా తీసుకున్నారు. తుని ఘటనతో ఆ వైపు నుంచి వెళ్లాల్సిన పలు దూరప్రాంత రైళ్లను వేర్వేరు రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. తుని రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైలు పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించారు. రైలు రోకో, రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో జాతీయ రహదారులు కూడా దిగ్బంధించారు. దీంతో, పలుచోట్ల కిలోవిూటర్లకొద్ది వాహనాలు నిలిచిపోయాయి. తునిలో ఘటనల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసరంగా సవిూక్ష జరిపారు. ¬ంమంత్రి చినరాజప్ప, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వివరాలు అందజేస్తున్నారు. కాపు గర్జనకు 81 బస్సులు ఏర్పాటు చేశామని, రెండువేల మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తునిలో ఈ పరిణామాలు తలెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు సంయమనంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆందోళనకారులపై తాము తీసుకునే చర్యలతో అమాయకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆందోళనకారులపై రైల్వేశాఖ పరిధిలోనే కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపింది. తునిలో జరిగిన ఘటనలను ఏపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌, వైసీపీ పథకం ప్రకారమే హింస జరిగిందన్నారు. కాపులు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ రాముడు హెచ్చరించారు. తునికి అదనపు బలగాలు పంపిస్తున్నామని చెప్పారు. విూటింగ్‌ పేరుతో వచ్చి విధ్వంసం సృష్టించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రత పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ శాంతిభద్రతల అదనపు డీజీ తెలిపారు. తుని ప్రాంతానికి అదనపు బలగాలు తరలించినట్లు చెప్పారు. సివిల్‌ పోలీసులు, ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌, పారా మిలటరీ బలగాలు మోహరించినట్లు తెలిపారు. అన్ని రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలో భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అంతకుముందు తుని మండలం వి.కొత్తూరులో నిర్వహించిన కాపు ఐక్యగర్జనలో ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కాపు సామాజిక వర్గంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. కాపులను బీసీలో చేర్చకుండా ప్రభుత్వ నేతలు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంలో ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేస్తోందని? సర్కారు విధానాలతో కాపులు అయోమయానికి గురవుతున్నారన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న కాపు వ్యతిరేక విధానాలను తెలియజేసేందుకే ఈ సభ ఏర్పాటు చేసినట్లు పద్మనాభం తెలిపారు. కాపు ఐక్యగర్జనను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కాపుల హక్కుల పోరాటంలో తమ కుటుంబం ముందు వరుసలో ఉన్నట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో కాపులు ఎంతో నష్టపోతున్నారన్నారు. ఐక్యగర్జన సదస్సుకు కాపులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చారు.

విజయవాడలో 144 సెక్షన్‌

తునిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నగరంలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే విజయవాడలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మంగళగిరి నుంచి అదనపు బలగాలు చేరుకున్నట్టు సమాచారం. అయితే కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు  కాపులకు ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్‌ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సవిూపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్‌, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్‌ సవిూపంలో  ఆందోళన చేస్తుం

డగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్‌ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని

ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం

తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు. ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్‌ టక్కర్‌, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *