Tuesday, 3 November 2026

అడవి జంతువుల వేటకు విద్యుత్ తీగలను అమర్చి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేసిన పోలీసులు

అడవి జంతువుల వేటకు విద్యుత్ తీగలను అమర్చి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేసిన పోలీసులు..

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:
కాగజ్ నగర్ రూరల్: జనం సాక్షి 04 జనవరి/ కాగజ్ నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ నాగరాజు, రూరల్ ఎస్సై సోనియా ఈరోజు వివరాలు వెల్లడించారు. రూరల్ సిఐ నాగరాజు మాట్లాడుతూ కాగజ్ నగర్ మండలంలోని కోసిని గ్రామ పరిధిలోని పార్ధన్ గూడ సమీపంలో డిసెంబర్ 31 వ తేదీ రోజున తమ పొలం వద్ద అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగల కు తగిలి ఆడే విష్ణు మరణించడంతో తండ్రి ఆడే కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పార్ధన్ గూడ సమీపంలో విద్యుత్ తీగలను అమర్చిన కోసిని గ్రామానికి చెందిన A1) లెండుగురే హనుమంతు. A2) ఆడే బాపురావు.. A3).. సోనులే నగేష్ A4..) కొట్రంగి బాపూరావు. అనే నిందితులను కోసిని గ్రామ శివారులో ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ నాగరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నమని అయిన కూడ, కొంతమంది మాత్రం తమ పద్ధతులను మానుకోవడం లేదని అన్నారు. ఆ విధంగా పద్దతులు మార్చుకొని వారిపై ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పీడి ఆక్ట్ నమోదు చేస్తామని అన్నారు. నిందితుల వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు. ఒక సైకిల్ ,బైండింగ్ వైర్ స్వాధీన పరుచుకున్నామని తెలియజేశారు. గతంలో లో కూడా వీరు అడవి జంతువులను వేటాడినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రూరల్ సిఐ నాగరాజు తో పాటు రూరల్ ఎస్సై సోనియా, పోలీస్ సిబ్బంది రమేశ్, వెంకటేష్ పాల్గొన్నారు.