అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని జాతీయ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ ఆఫీస్ లో ఆ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిని అర్హులుగా గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.నూతనంగా రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఒంటరి మహిళల పెన్షన్ ను రూ. 5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షురాలు కోటమ్మ , అనంతుల మల్లేశ్వరి, అలివేలు, జయసుధ, లక్ష్మి , దంతాల పద్మరేఖ, కళ, అంజమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.




