అడ్డాకులలో ఐకాస ఆందోళన

అడ్డాకుల: సడక్‌బంద్‌లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాటవరంవద్ద జాతీయరదారిపై రోడ్డుపై టైర్లకు మంట పెట్టారు. అదేసమయంలో ఎస్పీ నాగేందర్‌ కుమార్‌ చేరుకుని రహదారిని పునరుద్ధరించారు.