Saturday, 7 November 2026

అడ్వకేట్ మాతంగి సురేష్ కుమార్ కు జ్యూరిస్ట్ అవార్డు

అడ్వకేట్ మాతంగి సురేష్ కుమార్ కు జ్యూరిస్ట్ అవార్డు – న్యాయ విజ్ఞాన వేత్తల పురష్కారం కొండమల్లేపల్లి నవంబర్ 27 జనం సాక్షి న్యూస్ : భారతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నందా, జస్టిస్ వామనరావు, జస్టిస్ బి. చంద్రకుమార్ చేతులమీదుగా అడ్వకేట్ మాతంగి సురేష్ కుమార్ కు జ్యూరిస్ట్ అవార్డు – న్యాయ విజ్ఞాన వేత్తల పురష్కారం అవార్డును తెలంగాణ ఇంటలెక్సువల్ ఫోరం ప్రధానం చేసింది.రాజ్యాంగ స్ఫూర్తి బద్దంగా, రాజ్యాంగ లక్ష్యసాధనలో విధులు నిర్వహిస్తూ, స్ఫూర్తిదాయక సామాజిక సేవలు అందిస్తున్నందుకు, న్యాయ విజ్ఞాన వేత్తగా గుర్తించి ఈ అవార్డుకు రావడం అడ్వకేట్ మాతంగి సురేష్ కుమార్ స్పందిస్తూ ఈ అవార్డు దక్కడం సంతోషదాయకమైన విషయమని, చాలా గౌరవంగా భావిస్తున్నానని, మరింత అంకితభావంతో పనిచేసే బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. అడ్వకేట్ సురేష్ కుమార్ ను అధికారులు సిబ్బంది, మిత్రులు అభినందించారు.