పంతులమ్మ శారదకు పీహెచ్డీ పట్టా ప్రదానం
జుక్కల్,నవంబర్ 27,(జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలములోని ప్రభుత్వ తెలంగాణా స్టేట్ మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాల అచ్చంపేట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా పనిచేస్తున్న శారదకు ఉస్మానియా విశ్వ విద్యాలయంవారు పిహెచ్డి పట్టాను ప్రదానం చేశారు. ఈమె ప్రోపెసర్ ఐ. డైసీ అధ్వర్యంలో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అర్థ శాస్త్ర విభాగంలో బిహేవియర్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఎక్రేజ్ అండర్ షుగర్ కేన్ ఇన్ తెలంగాణ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించారు. ఇందుకు గాను ఆమెకు పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు మారుమూల గ్రామంలో పుట్టిన తనకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను అందజేయడం సంతోషం గాఉందని ఆన్నారు. తన పరిశోధనకు సహకరించిన భర్త చెన్నయ్య కు ఆమె ధన్యవాదాలు తెలిపారు
పంతులమ్మ శారదకు పీహెచ్డీ పట్టా ప్రదానం




