భారతీయ జనతా పార్టీలో చేరికలు
జహీరాబాద్ నవంబర్ 27( జనం సాక్షి) నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ గుడిగ్యార్ పల్లి గ్రామ 30 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శివ ఆధ్వర్యంలో జంగం గోపి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు, ఈ సందర్భంగా జంగం గోపి జహీరాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాండు ,ప్రవీణ్ ,అరవింద్ ,
శేఖర్ ,శ్రీశేలం ,మహేష్ ,శ్రీకాంత్ ,మహేష్ ,ప్రవీణ్ రెడ్డి ,మధు ,నర్సిములు ,కృష్ణ ,రమేష్ ,మధు ,విశ్వనాధ్ స్వామి ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు




