అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం.
-ప్రిన్సిపల్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్26 (జనంసాక్షి):
పాలెం ప్రభుత్వ డిగ్రీ &పీజీ కళాశాలలో తెలుగును బోధించుట కొరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రిన్సిపల్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ ఒక ప్రకటనలో కోరారు. తెలుగులో రెండు పోస్టులు ఉన్నాయని తెలిపారు.అభ్యర్థులు పీజీలో కనీసం 55 శాతం మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి బోధన అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. పిహెచ్. డి, లేదా నెట్/సెట్ గాని అర్హత కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ సర్టీఫికెట్స్తో కళాశాలలో ఈనెల 29న సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తు చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు.




