షాదిఖానా నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలి
మెట్ పల్లి మర్కజీ ఇంతేజామి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా
మెట్టుపల్లి టౌన్, డిసెంబర్ 26, జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణంలో జరుగుతున్న షాదిఖానా నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని మెట్ పల్లి మర్కజీ ఇంతేజామి కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా అన్నారు. సోమవారం పట్టణంలోని బీడీ కాలనీలో జరుగుతున్న షాదీఖానా నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ నిర్మాణ పనులపై ఆరా తీశారు వచ్చే రెండు మూడు నెలల్లో పనులను పూర్తి చేసే విధంగా సహకరించాలని కోరారు. పనులు నాణ్యతతో కూడినవిగా జరపాలని సూచించారు. వచ్చే ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలంలో ఇక్కడ వరద నీరు రాకుండా, వరద నీటితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షాదిఖానా నిర్మాణం జరగాలని సూచించారు. పక్కనే వట్టివాగు ప్రవహిస్తూ ఉండడంతో నీటి కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంపూర్ణ సహకారంతో సకాలంలో పనులు పూర్తి అవుతాయని ఆశ భావం వ్యక్తం చేశారు. షాదిఖానా నిర్మాణం పూర్తయితే ఎంతోమంది పేద ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడుతుందని అన్నారు. కాగా కాంట్రాక్టర్ మాట్లాడుతూ సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజి ఇంతేజామీ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రెటరీ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు క్యాషియర్ ఆర్గనైజర్ సెక్రెటరీలు లీగల్ అడ్వైజర్ అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
షాదిఖానా నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలి




