Sunday, 8 November 2026

ముస్లిం కమిటీ అధ్యక్షున్ని సన్మానించిన జె ఎన్ వెంకట్

ముస్లిం కమిటీ అధ్యక్షున్ని సన్మానించిన జె ఎన్ వెంకట్.
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 26, జనంసాక్షి :
ఇటీవల జరిగిన ముస్లిం కమ్యూనిటీ ఎన్నికల్లో పట్టణ అధ్యక్షుడిగా గెలుపొందిన మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా ను బీజేపీ నాయకులు , కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ జే ఎన్ వెంకట్ సన్మానించారు. పట్టణం లోని పాషా ఇంటికి వెళ్ళి శుభాకాక్షలు తెలిపి శాలువాతో సన్మానించి అభినందించారు. ముస్లిం కమ్యూనిటీ అబివృద్దికి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.ఆయన వెంట బొడ్ల నగేష్, బొడ్ల నరేష్, కొమిరెడ్డి శేషు, గంగారెడ్డి తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.