Tuesday, 3 November 2026

అతిరుద్ర మహాయాగానికి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు.

తాండూరు జులై 5(జనంసాక్షి) ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి స్వగృహ ప్రాంగణంలో ఈ నెల3నుండి13వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శత చండీ సౌర,లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో* భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిధిగా పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు వస్తున్నారు. కాబట్టి ఈ యాగం లో పాల్గొనే దంపతులు మరియు భక్తులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని ప్రవచనాలను అనుభూతి చెందవలసిందిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
విజ్ఞప్తి చేశారు.