వికారాబాద్ రూరల్ జూలై 5 జనం సాక్షి
పేద ప్రజల ఆరోగ్యానికి ఆచరణ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగకరమని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం” ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు 15,58,900 పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందలువిలువ గల 30 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ సీఎంఆర్ఎఫ్ పంపిణి చేశారు.పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం ఆర్ ఎఫ్ నిలుస్తూ కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారుఅనారోగ్యానికి గురైనటువంటి పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందుతుందని, అనారోగ్యానికి గురైన పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బంటారం పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ ధరూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు మోమిన్ పేట మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి ఆసరగా సీఎంఆర్ఎఫ్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”




