బచ్చన్నపేట జూలై 04 ( జనం సాక్షి) : తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని కొనియాడారు భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియవలసిన అవసరం ఉందన్నారు అలాగే బచ్చన్నపేట మండల కేంద్రంలో కురుమ సంఘం అధ్యక్షులు జంగిటి సిద్దులు ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన పోరాటస్ఫూర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొడిగం చంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ తాతిరెడ్డి భవాని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి కర్ణాల వేణు కో ఆప్షన్ సభ్యులు షబ్బీర్ వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలి. రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి




