బషీరాబాద్ ఏప్రిల్ 5, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ అతి పిన్న వయస్సు లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక శాఖ మంత్రి గా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు,సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు.భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని,1971వ సంవత్సరంలో ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత దేశంనికి రక్షణ మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి,జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి జయఖర్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్శిములు, సాయిలు గౌడ్, పవన్ ఠాగూర్, ధన్సింగ్,తదితరులు పాల్గొన్నారు.




