Tuesday, 3 November 2026

అత్తింటి వేధింపులకు మరో అబల బలి

వరకట్న బాధలు తట్టుకోలేక ఆత్మహత్య

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కట్టుకున్న భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోరబండ రాజ్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌నగర్‌లో ఉంటున్న స్వామి బుచ్చమ్మ దంపతుల కుమారుడు దారుపల్లి రామారావు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన బోడా కృష్ణ జయమ్మ కూతురు విూనాను మూడేండ్ల క్రితం కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. రామారావు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, విూనా ఇంటి వద్దనే ఉంటున్నది. కాగా, కొంత కాలంగా భర్త, అతని తల్లి బుచ్చమ్మ అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని తల్లి, సోదరునికి తెలిపింది.ఈ క్రమంలో శనివారం రామారావు ఇంటికి చేరుకున్న బావమరది వెంకన్న తమ ఇం ట్లో శుభకార్యం ఉన్నది పంపించాలని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త పెడుతున్న వేధింపులు తల్లితో చెప్పి ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో ఉన్న కూతురు ఎంతకీ బయటకు రాకపోవడంతో లోనికి వెళ్లి చూడగా, అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నది. దీంతో కిందికి దించిచూడగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.