Tuesday, 3 November 2026

విరక్తితో యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి):జీవితంలో స్థిరపడాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోమనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో నివాసం ఉండే యువతి అమల(25) నాలుగేండ్లుగా అమెరికాలో ఉండి ఇటీవల నగరానికి వచ్చింది. తన జీవితంలో ఏదీసరిగా జరగడం లేదంటూ కొన్నిరోజులుగా కుటుంబసభ్యులతో చెబుతుండేది. శనివారం రాత్రి ఆరోగ్యం బాగలేదంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అర్ధరాత్రి అయినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి గదిలో లభించిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.