అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం
పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు
మెట్ పల్లి టౌన్, జనవరి12,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజున ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు, పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరిగింది, ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా ఈ కళ్యాణం నిర్వహిస్తారు.అమ్మవారికి విశేషమైన భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు కళ్యాణం అనంతరం అమ్మవారికి సారే ఓడి బియ్యం వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు తదానంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అనంతరం అన్నదానం నిర్వహించిన అరిగెల సత్యనారాయణ దంపతులు, విశ్వనాథం దంపతులు ఈ అన్నదాన కార్యక్రమంలో 1500 మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మహజన్ నర్సింలు,మాంచాల రవీందర్, మహజన్ శివకుమార్,సుతారి అంజయ్య,దొంతుల రాజ్ కుమార్, రాజేశ్వర్గౌడ్, మాలెపు రాములు,మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే




