కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించిన పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి
జహీరాబాద్ జనవరి 13( జనం సాక్షి). మండల పరిధిలోని శేఖాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీలో కార్యదర్శి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక డాక్టర్ల చేత కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రత్యేక డాక్టర్ల ద్వారా వారికి పరీక్షలు జరిపి కంటి అద్దాలను అందిస్తామని గ్రామంలోని ప్రతి పౌరులు కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎవరికైనా తెలియకపోతే వారికి కూడా తెలియజేయాలని గ్రామపంచాయతీ ద్వారా చాటింపు కార్యక్రమం చేపడతామని సామాజిక మాధ్యమాల్లో యువతకు అవగాహన కల్పిస్తామని గ్రామంలోని ప్రతి ఒక్కరు 100% కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని చిన్న పెద్ద బయో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ శెట్టి నర్సింలు, ఉప సర్పంచ్ మహేబూబ్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, సర్పంచ్ ప్రతినిది గడ్డమీది చిన్నారెడ్డి, మెంబర్లు ఫైజుద్దీన్, ఇబ్రహీం, మన్సూర్ అలీ, అంగన్వాడీ టీచర్లు హాజిర బేగం, లలిత, పుణ్యమ్మ, ఆశ వర్కర్లు, ఏ ఎన్ ఎమ్, పంచాయతీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు..




