Thursday, 5 November 2026

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి
పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన
ఎన్ హెచ్ ఆర్ సి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా
కొండమల్లేపల్లి జనవరి 13 జనం సాక్షి న్యూస్ :
తెలుగు రాష్ట్రాలలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికైనటువంటి సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆనందాలను వెల్లివిరియాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్హెచ్ఆర్సి అధ్యక్షులు సయ్యద్ గౌస్ పాషా అన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనగానే గంగిరెద్దులు హరిదాసులు బొబ్బెమ్మలు గాలిపటాలు ముగ్గులు రంగవల్లులతో మూడు రోజులు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి అని ఆయన తెలిపారు. ప్రతి ఇంట కుటుంబ బంధు సమేతంగా ఆద్యంతం సంక్రాంతి భోగి మకర పండుగను మరింత ఉత్సాహంగా సంతోషాల మధ్యన జరుపుకోవాలని ప్రజలందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.