హుజూర్ నగర్ మార్చి 6 (జనంసాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో గత నెల ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన లింగమంతుల స్వామి జాతరను పురస్కరించుకొని జాతర జరిగిన రోజు నుండి నెలలోపు చివరి సోమవారం నెలవారంలా చేయడం గతం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం అందులో భాగంగా సోమవారం అమరవరం గ్రామంలో లింగమంతుల గుట్టపై జరిగే నెల వారానికి యాదవ సోదరులు తమ సంప్రదాయ పద్ధతిలో బేర్లు వాయిస్తూ ఉండగా మహిళలు బోనాలు ఎత్తుకొని శివసత్తుల పూనకాలతో అత్యంత భక్తి పరవశంగా గుట్ట మీదికి బయలుదేరారు. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు పాల్గొని బోనం ఎత్తుకొని లింగమంతుల స్వామికి, గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ అమరవరం లింగమంతుల స్వామి మహిమ గలిగిన దేవుడన్నాడు. దేవాలయ అభివృద్ధికి గతంలో 30 లక్షలు వెచ్చించి ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం గుట్టమీద వచ్చిన భక్తులకు నీటి వసతి కల్పించడంతోపాటు, ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయుటకు మరో 25 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలియజేశారు. భవిష్యత్తులో లింగమంతుల స్వామి గుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో గొప్ప జాతరగా తీర్చిదిద్దెల అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, ఉప సర్పంచ్ దూబ బాల సైదులు, పిఎసిఎస్ చైర్మన్ అన్నెం శౌరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు సాముల మట్టారెడ్డి, ఉస్తెలలింగారెడ్డి, వరలక్ష్మి, లింగారెడ్డి, కవిత, నాగరాజు, ధనమ్మ, పిచ్చి బాబు, సుగుణా, నగేష్ , పుస్తెల చిన గురవారెడ్డి, లింగమంతుల స్వామి గుట్ట చైర్మన్ అమరబోయిన మట్టయ్య, వైస్ చైర్మన్ మద్దుల లింగరాజు, దేవస్థాన కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు కృష్ణ, కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, సుధీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సతీష్ రాజు, ఉపేందర్ రెడ్డి, సైదులు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.




