వీణవంక మార్చి 6 (జనం సాక్షి )వీణవంక మండలంలోని గన్ముకుల గ్రామంలో గత ఐదు రోజులుగా చిరుతల రామాయణ కళాకారులకు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి వారి ఆదేశాల మేరకు కళాకారులకు మెమొంటో, శాలువలతో స్థానిక మండల నాయకులు ఎంపీపీ మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ల పోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, కళాకారులను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలోనే కళాకారులకు గుర్తింపు వచ్చిందని కళాకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి చైర్మన్ నియమించడం జరిగిందన్నారు గ్రామాలలోని కళాకారులు ముందుకు వచ్చి మంచిని గ్రహించి చెడును వదిలేయాలని సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున అవగాహన కల్పించిన కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని ఇలా కళాకారులు అనేక పాత్రలు వేశారు ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొమురయ్య, కాంతాల రాజిరెడ్డి, రాఘవరెడ్డి, సదాశివరెడ్డి, కోటీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.




