తాళ్లపల్లి రవి
కొండమల్లేపల్లి జనవరి 25 (జనంసాక్షి) న్యూస్ :
నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం అజ్మాపురం గ్రామంలో మంగళవారం మానసిక దివ్యగురాలు పైన జరిగిన అత్యాచారాన్ని తెలుసుకొని బుధవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాలమహానాడు రాష్ట్ర, జిల్లా డివిజన్, మండల స్థాయి నాయకులు యువతీని, యువతీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్ అధ్యక్షతన గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మరియు రాష్ట్ర మహిళ అధ్యక్షులు గాజుల పున్నామ మాట్లాడుతూ పీఏ పల్లి మండలంలో కొద్ది రోజుల క్రితం అత్యాచారం జరిగి బాలిక మృతి చెందిన ఘటన మరువకముందే మంగళవారం అజ్మాపురం గ్రామంలో మానసిక దివ్యాంగురాలు అయినటువంటి యువతిపై అత్యాచారం జరగడం చాలా దారుణం అన్నారు. ఈ యువతని కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు పరామర్శించి యువతకి న్యాయం చేయాలన్నారు . యువతికి ఎక్స్ గ్రేసియో ప్రకటించి అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. మరియు ఈ ఘటనకు పాల్పడిన నిందితులైన ఆడెపు అంజయ్య, గోసంగి ప్రసన్న, వస్కుల రాజేష్ లకు త్వరితగతిన చట్ట ప్రకారం శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. లేనిపక్షంలో వారు అనేక విధమైనటువంటి నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. ఆడవారికి రక్షణ లేకుండా దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉందన్నారు. ప్రభుత్వం పరంగా పోలీసు వారి పరంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. యువత ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా చేపట్టవలసిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర, పోలీసు యంత్రాంగం త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలను అరికట్టాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులను నివారించాలన్నారు. సమాజంలో చట్టాలపై ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, రాష్ట్ర మహిళ కార్యదర్శి రమణ, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వనపట్ల శోభ,
నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, జిల్లా నాయకులు జోసఫ్, ఎర్ర సైదులు, భూతం సైదులు, దేవరకొండ డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ మండల శివ, డివిజన్ ఉపాధ్యక్షులు సైదులు,డివిజన్ నాయకులు రాంబాబు,రాజేష్,పి. ఏ. పల్లి మండల అధ్యక్షుడు రెడ్డిమల్ల రవి, ఉపాధ్యక్షులు నరేష్, మండల కార్యదర్శి జోజి, కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు సురేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అత్యచార యువతికి న్యాయం జరగాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు




