Wednesday, 4 November 2026

యువత ఓటర్ల నమోదులో ముందుండాలి: ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.

 

ఖమ్మం. తిరుమలాయపాలెం (జనవరి 25) జనం సాక్షి. యువత ఓటర్ల నమోదులో ముందుండాలని ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ యువతను ఉద్దేశించి పిలుపునిచ్చారు.తిరుమలాయపాలెం మండల పరిధిలోని పీండీప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలలో *ఓటే పౌరులకు ప్రథమ హక్కుగా వజ్రాయుధం గా మారీందని, యువత విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు యొక్క ఆవశ్యకత, ఎన్నికల విధానం వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని, దేశంలో స్వాతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘంను 1950 జనవరి 25న ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రతి సంవత్సరం కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యావాదులు జనవరి 25న ఓటర్ల దినోత్సవం ను జరుపూకుంటున్నమనీ, ప్రతి పౌరులలో ప్రశ్నించే తత్త్వం ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఆవిష్యకతలో ఎన్నికల సంఘాన్ని ప్రతిపాదన చేసి రాజ్యంలో ఉన్న ప్రతి పౌరులకు సమనహక్కు యొక్క ఆవశ్యకతను గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ హక్కును కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు,లెక్చరర్లు నారాయణ, చంద్రమౌళి , కార్యాలయ సిబ్బందులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు